ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్‌ సీఈవో భేటీ  | PepsiCo Global CEO Ramon Laguerta meet to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్‌ సీఈవో భేటీ 

Sep 19 2025 5:21 AM | Updated on Sep 19 2025 8:04 AM

PepsiCo Global CEO Ramon Laguerta meet to PM Narendra Modi

న్యూఢిల్లీ: పెప్సికో గ్లోబల్‌ సీఈవో, చైర్మన్‌ రామన్‌ లగుర్తా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత మార్కెట్లో  ధీర్ఘకాల వ్యాపార లక్ష్యాలు, పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలు, పరస్పర అభివృద్ధి అవకాశాలపై మోదీతో చర్చించారు. లగుర్తాతో పాటు కంపెనీ భారత సీఈవో జాగృత్‌ కొటేచా, గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

చిరుతిళ్లు(స్నాక్స్‌) ఆహారోత్పత్తులపై జీఎస్‌టీ 12% నుంచి 5 శాతానికి తగ్గిన నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జీఎస్‌టీ తగ్గింపుతో పెప్సికో కీలక బ్రాండులు లేస్, కుర్‌కురే, చీటోస్, క్వాకర్‌ ఓట్స్‌కు లబ్ధి చేకూరనుంది. అయితే శీతలపానియాలపై 40% పన్ను విధించారు. పెప్సికో భారత్‌ను ‘అత్యంత కీలక మార్కెట్‌’గా పరిగణిస్తూ అసోంలో ఫుడ్స్‌ ప్లాంట్, మధ్యప్రదేశ్‌లో ప్లేవర్‌ తయారీ కేంద్రం, ఉత్తరప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement