ఉద్యోగాల ఊచకోత..వందల మందిని తొలగిస్తున్న టెక్‌ కంపెనీలు..ఇదే బాటలో

Oyo Fires 600 Employees Before Ipo - Sakshi

ఆతిథ్య సేవల్ని అందించే ఓయో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఆర్ధిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనతో సంస్థకు చెందిన 600మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. 

ఓయోలో దేశ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సంస్థ పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్‌)లో భాగంగా ఇంజినీరింగ్‌,వెకేషన్‌ హోమ్‌ టీమ్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో పార్ట్నర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్మెంట్‌, బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు తెలిపింది. 

ఇక యాప్‌లో గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ వంటి కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేస్తున్న టీమ్‌ సభ్యుల్లో ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top