ఎలక్ట్రిక్‌ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ | Olectra Greentech Unveils New Brand Identity | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ

Apr 11 2026 7:07 AM | Updated on Apr 11 2026 8:42 AM

Olectra Greentech Unveils New Brand Identity

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎవ్రీడే’ అనే ట్యాగ్‌లైన్‌తో తమ నూతన బ్రాండ్‌ ఐడెంటిటీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత మొబిలిటీ, పరిష్కారాలను అందించే ఆవిష్కరణల ఆధారిత సంస్థగా కంపెనీ పరిణామక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

పర్యావరణహిత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్‌ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తువైపు ప్రపంచాన్ని నడిపించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందని సంస్థ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు. నిర్మాణాత్మక సమగ్రత, లక్ష్యంతో కూడుకున్న దిశను సూచించేలా త్రిభుజాకారంలో ఒలెక్ట్రా ప్రిజం, దాని చుట్టూ ఒలెక్ట్రా యూనివర్స్‌ని సూచించే వృత్తంతో లోగో ఉంటుంది. వాటాదారులు, నగరాలు, కంపెనీ అందించే సేవల విస్తృత వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement