Ola Future Factory: అక్కడ అంతా మహిళా ఉద్యోగులే

Ola Futurefactory will be run entirely by women. - Sakshi

న్యూఢిల్లీ:  రానున్న కాలంలో ఓలా 'ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ'ని మహిళామణుల చేత నిర్వహిస్తామని ఓలా చైర్మన్‌ భవేశ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్‌కీ  ఆత్మనిర్భర విమెన్‌ అవసరమని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీని దాదాపు 10 వేల మంది మహిళలే  నిర్వహిస్తారని, ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళలు ఉన్న ఫ్యాక్టరీగా ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ నిలవనుందని చెప్పారు. మహిళలను సమగ్ర శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఆర్థిక పరంగా ఉపాధి అవకాశలు కల్పించిన తొలి సంస్థగా ఓలాను అభివర్ణించారు.
చదవండి: సియాచిన్‌ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు

సమానత్వానికే పెద్ద పీట.....
ఈ క్రమంలో మహిళల నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇవ్వడానికీ పెట్టుబడులు పెట్టామని భవేశ్‌ తెలిపారు. ఈ ఉపాధి అవకాశాలు ఆర్ధికపరంగా వారి జీవితాల్ని, కుటుంబాల్ని మాత్రమే కాక యావత్‌ సమాజాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.  అంతేకాక వాహనాల ఉత్పాదనకు సంబంధించిన పూర్తి బాధ్యత మహిళలదేనని చెప్పారు.

శ్రామిక శక్తిలో మహిళల సమానత్వానికీ ప్రాధాన్యత ఇస్తే భారత్‌ జీడీపీ  వృద్ధి రేటు 27% పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తరాలలో శ్రామిక శక్తిలో సమానత్వాన్ని తీసుకువచ్చేలా కార్యచరణ దిశగా తొలి అడుగులు వేసిన సంస్థగా ఓలా నిలుస్తుందన్నారు.  భారతదేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని భవేశ్‌ చెప్పారు.
చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత​ బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top