అదే జ‌రిగితే..మన దేశంలో ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రించే పరిస్థితి ఉండదు!

No One Will Go To Bed Empty Stomach If 30 Trillion Economy Says Adani - Sakshi

ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరితే అప్పుడు ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో నిద్రించే పరిస్థితి ఉండదని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ అన్నారు.

‘‘2050 నాటికి 10,000 రోజులు ఉన్నాయి. ఈ కాలంలో 25 ట్రిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థ పరిధి పెరుగుతుందని నేను అంచనా వేస్తున్నాను. అంటే ప్రతి రోజూ 2.5 బిలియన్‌ డాలర్ల మేర జీడీపీకి అదనంగా తోడవుతుంది. ఇదే కాలంలో దేశం నుంచి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించొచ్చు. అంతేకాదు 40 ట్రిలియన్‌ డాలర్ల మేర స్టాక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా పెరుగుతుంది.

 

అంటే 2050 వరకు రోజూ 4 బిలియన్‌ డాలర్ల చొప్పున అధికం అవుతుంది’’అంటూ ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘ఇండియా ఎకనమిక్‌ కాంక్లేవ్‌’ కార్యక్రమంలో భాగంగా అదానీ పేర్కొన్నారు. 2021లో 49 బిలియన్‌ డాలర్ల మేర అదానీ తన సంపదను వృద్ధి చేసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం.

చదవండి👉 అదానీనా మజాకానా.. ముఖేష్‌ అంబానీకి భారీ షాక్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top