
వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’ను ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్ అని సంస్థ ఎండీ మధు లూనావత్ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్‌ఐ దీనికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రైవేట్ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్ గ్రూప్‌లో ది వెల్త్ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (ఏఐఎఫ్)ను కూడా నిర్వహిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ ‘డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్’ ఎఫ్‌వోఎఫ్ ..
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్‌క్యాప్‌లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
పలు ఫండ్ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్‌తో పొందవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎండీ నవ్‌నీత్ మునోట్ తెలిపారు. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఇదీ చదవండి: జియో బ్లాక్‌రాక్ తొలి ఫండ్..