స్పైస్‌జెట్‌కు ఎన్‌సీఎల్‌టీ నోటీసులు

Nclt Issued Notice To Spicejet On A Petition Filed By Aircastle - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్‌క్యాజిల్‌ (ఐర్లాండ్‌) పిటీషన్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ జరిపింది. స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది.

నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్‌సీఎల్‌టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్‌ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు.

స్పైస్‌జెట్‌పై ఎయిర్‌క్యాజిల్‌ ఏప్రిల్‌ 28న పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్‌క్యాజిల్‌ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్‌తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్‌జెట్‌ గత వారం తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ వెబ్‌సైట్‌ ప్రకారం స్పైస్‌జెట్‌పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top