2025 నాటికి టీబీ సమూల నిర్మూలన: మైల్యాబ్‌ కీలక ఆవిష్కారం

Mylab launches TB detection kit - Sakshi

క్షయను గుర్తించే మైల్యాబ్‌ కిట్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డయాగ్నోస్టిక్‌ కిట్స్‌ తయారీలోఉన్న మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌.. క్షయ వ్యాధిని గుర్తించేందుకు పాథోడిటెక్ట్‌ పేరుతో ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత కిట్‌ను రూపొందించింది. క్షయ చికిత్సలో వాడే రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్‌ ఔషధాలు రోగిపై ఏ మేరకు పనిచేస్తాయో కూడా ఒకే పరీక్షలో తెలుసుకోవచ్చు. ఈ కిట్‌కు సీడీఎస్‌సీవో, టీబీ ఎక్స్‌పర్ట్‌ కమిటీ, ఐసీఎంఆర్‌ ఆమోదం ఉందని కంపెనీ తెలిపింది.  

క్షయవ్యాధికి సంబంధించి ఒకే పరీక్షలో రిఫాంపిసిన్,  ఐసోనియాజిడ్‌లకు బహుళ ఔషధ నిరోధకతనుగుర్తించే మేడ్ ఇన్ ఇండియా టీబీ డిటెక్షన్ కిట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పెద్ద ఎత్తున ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఈ కిట్‌కు అనుమతినిచ్చినట్టు ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో TB నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాలంలో రెండు సమస్యల్ని పరిష్కరిస్తున్నామని మైల్యాబ్ ఎండీ హస్ముఖ్ రావల్  తెలిపారు.దేశంలో 2025 నాటికి  టీబీనీ సమూలంగా నిర్మూలించాలనే  ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ఇవ్వడంలో  కీలకమైనదిగా భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top