టెస్లాకు పోటీగా మెర్సిడిజ్‌ బెంజ్‌ సంచలన నిర్ణయం

Mercedes Benz Hits Accelerator In E Car Race With Tesla - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి కోసం భారీ పెట్టుబడులు

టెక్నాలజీ మార్పులో​ భాగంగా భారీగా ఉద్యోగాల కోత.

ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న టెస్లా కంపెనీకి పోటీగా మెర్సిడిజ్‌ బెంజ్‌ సంచలనం నిర్ణయం తీసుకుంది. మెర్సిడెస్‌ బెంజ్‌తయారీదారు డైమ్లెర్‌ 2030 నాటికి 40 బిలియన్ల యూరోలను(సుమారు రూ. 3, 50,442 కోట్లు ) ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తోంది. డైమ్లెర్‌ నిర్ణయంతో టెక్నాలజీ మార్పులో​ భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై కోత విధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మెర్సిడిజ్‌ బెంజ్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించింది. ఇతర భాగస్వాములతో సుమారు ఎనిమిది బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి, అన్ని కొత్త వాహన ప్లాట్‌ఫాంలలో ఈవీలను మాత్రమే తయారు చేస్తామని జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ బెంజ్‌ పేర్కొంది. 2025 వరకు సాంప్రదాయ పెట్రోలు వాహనాల ఉత్పత్తిని జీరో చేయాలని భావిస్తోందని కంపెనీ చీఫ్‌ ఓలా కొల్లెనియస్ పేర్కొన్నారు.  

శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడానికి పలు కంపెనీలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. జనరల్‌ మోటార్స్‌, 2035, వోల్వో కార్స్‌ 2030 నాటికి పూర్తిగా శిలాజ ఇంధనాల వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి.  అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ వాహనరంగంలో టెస్లాకు పోటీగా ఎదగాలని కంపెనీలు ప్రణాళికలను రచిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top