
ఈ ఏడాది రూ. 2,000 కోట్ల టర్నోవరు లక్ష్యం
కొత్తగా రెండు ఆస్పత్రులు ∙సంస్థ చైర్మన్ అనిల్ కృష్ణ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ సేవల దిగ్గజం మెడికవర్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
గ్రూప్‌లో 24వదైన సికింద్రాబాద్ హాస్పిటల్‌ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో మరొకటి (500 బెడ్స్ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్ చందానగర్‌లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు.
చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ ...
ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు.