
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్‌షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్‌జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్‌లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.
సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్‌యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.
ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు