మారుతీ లాభం స్పీడ్‌ Maruti Suzuki Profit jumps 33percent to Rs 3207 cr Q3 | Sakshi
Sakshi News home page

మారుతీ లాభం స్పీడ్‌

Published Thu, Feb 1 2024 5:57 AM

Maruti Suzuki Profit jumps 33percent to Rs 3207 cr Q3 - Sakshi

న్యూఢిల్లీ:  మారుతీ సుజుకీ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3) లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ. 3,207 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,406 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 33,513 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 29,251 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. ఈ కాలంలో 8 శాతం అధికంగా 5,01,207 వాహనాలను విక్రయించింది.

వీటిలో దేశీ అమ్మకాలు 4,29,422 యూనిట్లుకాగా.. 71,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఇవి ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గత క్యూ3లో దేశీయంగా 4,03,929, విదేశాలలో 61,982 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌–డిసెంబర్‌) మారుతీ సుజుకీ 7 శాతం వృద్ధితో మొత్తం 15,51,292 వాహనాలను విక్రయించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆదాయం, నికర లాభాల్లోనూ రికార్డులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 1,03,387 కోట్లను తాకగా.. నికర లాభం 9,536 కోట్లు ఆర్జించింది.
 
ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 2.3 శాతం బలపడి రూ. 10,183 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement