ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై మహీంద్రా కంపెనీ దండయాత్ర

Mahindra Plans To Launch 16 EV Models By 2027: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌పై దండయాత్ర చేసేందుకు సిద్దం అవుతుంది. భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో తన నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఎస్యూవీ, లైట్ కమర్షియల్ వెహికల్ విభాగాలలో 2027 నాటికి 16 మోడల్స్ ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీలు) ప్రారంభించాలని యోచిస్తోంది. 2025 నాటికి ఆదాయంలో 15-20 శాతం వృద్ధి సాధించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, కంపెనీ వృద్ధి చెందడానికి ఎలక్ట్రిక్ వాహనావ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా తీసుకొని రావాలని చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనా రంగంలో రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. అలాగే, 2027 నాటికి విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు కొత్త బ్రాండ్ పేరును కూడా పరిశీలిస్తోంది.
"మేము 2027 నాటికి ఎస్‌యూవీలో 13 కొత్త వాహనాలను లాంచ్ చేయాలని చూస్తున్నాము, వాటిలో ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల నుంచి వచ్చే వాహనాలు మొత్తం UV(యుటిలిటీ వెహికల్స్) వాల్యూమ్‌లలో కనీసం 20 శాతం ఉంటాయి" అని ఎమ్&ఎమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ వర్చువల్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో పేర్కొన్నారు. కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో నాలుగు 2025-27 మధ్య వచ్చే అవకాశం ఉంది. 2027 నాటికి 17 కొత్త వాహన లాంచ్‌లలో ఎనిమిది ఈవీలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.
(చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది)