ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్! | Mahindra EV SUVs Cross 50000 Sales | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 50వేలు.. మహీంద్రా సరికొత్త రికార్డ్!

Apr 4 2026 9:20 PM | Updated on Apr 4 2026 9:20 PM

Mahindra EV SUVs Cross 50000 Sales

మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశంలో దాని ఎలక్ట్రిక్ SUV శ్రేణి మొత్తం అమ్మకాలు 50,000 యూనిట్లను అధిగమించాయి.

మార్చి 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6లతో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్స్ శ్రేణి అధిక ప్రజాదరణ పొందగలిగింది. INGLO స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ మోడళ్లు.. ఎలక్ట్రిక్ SUV రంగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

మహీంద్రా కంపెనీ మొదటి ఏడు నెలల్లో 30,000 యూనిట్లు, 10 నెలల కాలానికి 41000 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇప్పుడు తాజాగా 50000 యూనిట్ల మార్క్ చేరుకుంది. కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం పండుగ సీజన్ అని తెలుస్తోంది. కాగా ఈ మోడల్స్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప అమ్మకాలను పొందగలవని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement