వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే! | Madelaine Brockway And Jacob LaGrone Spends Rs 490 Crore For Wedding In Paris | Sakshi
Sakshi News home page

వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!

Published Tue, Nov 28 2023 11:38 AM | Last Updated on Tue, Nov 28 2023 11:58 AM

Madelaine Brockway And Jacob LaGrone Spends Rs 490 Crore For Wedding In Paris - Sakshi

ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్‌షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్‌వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

26 ఏళ్ల మడేలైన్ బ్రాక్‌వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్‌'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్‌ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్‌కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం.

ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే..

కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement