కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ విడుదల

దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్
ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256
న్యూఢిల్లీ: ప్రీమియం మోటర్‌సైకిళ్ల బ్రాండ్ కేటీఎం శుక్రవారం కొత్త మోడల్ ‘‘కేటీఎం 250 అడ్వెంజర్’’ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద బైక్ ధర రూ.2,48,256 గా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని షోరూంల్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో అమర్చిన 248 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 30 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ స్లిప్పర్ క్లచ్ సాయంతో సిక్స్–స్పీడ్ గేర్ బాక్స్(6–గేర్లు) వ్యవస్థతో పనిచేస్తుంది.
దేశీయ మార్కెట్లో ఈ బైక్‌కు పోటీగా రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌పల్స్ మోడళ్లు ఉన్నాయి. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగాన్ని విస్తరించే లక్ష్యంతో ఈ మోడల్‌ను ఆవిష్కరించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచస్థాయి ఫీచర్లతో రూపకల్పన చేసిన ఈ మోడల్‌ను కస్టమర్లు ఆదరిస్తారని కంపెనీ ఆశిస్తోంది. అడ్వెంజర్ టూరింగ్, అవుట్‌డోర్ ప్రయాణాలు పట్ల ఆసక్తి చూపుతున్న యువతకు ఇది సరైన ఎంపిక అని బజాజ్ ఆటో బైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ తెలిపారు. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి