మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్.. డెలివరీలు షురూ! | Sakshi
Sakshi News home page

Keeway SR250: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!

Published Sun, Jun 18 2023 7:19 AM

Keeway SR 250 Deliveries Start in india price and details - Sakshi

Keeway SR250 Delivery: 2023 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో హంగేరియన్ టూ వీలర్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) దేశీయ మార్కెట్లో తన SR250 నియో రెట్రో మోటార్‌సైకిల్‌ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ 17 నుంచి మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎస్ఆర్250 మొదటి 500 మంది కస్టమర్లకు లక్కీ డ్రాతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతే కాకుండా మొదటి 5 మంది కస్టమర్లకు 100 శాతం పూర్తి క్యాష్ బ్యాక్ అందించే అవకాశం కూడా ఉంది. కంపెనీ ఇప్పుడు 'My SR My Way' అనే ఒక కొత్త కస్టమైజేషన్ ప్లాట్‌ఫామ్‌ని పరిచయం చేసింది. దీని ద్వారా కీవే బైకులను కస్టమైజ్ చేసుకోవచ్చు.

కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కీవే త్వరలో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) కూడా ప్రవేశపెట్టడానికి యోచిస్తోంది. దీని కింద లేబర్ ఛార్జ్, ఇంజిన్ ఆయిల్, విడిభాగాలు, యాక్ససరీలపైన తగ్గింపు అందించే అవకాశం ఉంటుంది. ఈ బైకులు భారతదేశంలోని బెనెల్లీ అవుట్‌లెట్‌ల ద్వారా అమ్ముడవుతాయి. కావున దేశవ్యాప్తంగా ఉన్న బెనెల్లీ డీలర్‌షిప్‌లలో కీవే బైకులు కొనుగోలు చేయవచ్చు.

(ఇది చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్‌ మరొకటి లేదు!)

డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. రౌండ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్‌లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో సింగిల్ పీస్ సీటు లభిస్తుంది. ఫీచర్స్ పరంగా కలర్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి.

(ఇది చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?)

కీవే ఎస్ఆర్250 బైకులో 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 7,500 rpm వద్ద 16 bhp పవర్ 6,500 rpm వద్ద 16 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్ బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement
Advertisement