Kashmiri Solar Car: కశ్మీర్‌.. సోలార్‌ పవర్‌.. లగ్జరీ కారు

A Kashmiri mathematician teacher Bilal Ahmed innovated a solar car - Sakshi

కశ్మీర్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు పదకొండేళ్లు శ్రమించి సామాన్యులకు లగ్జరీ ఫీచర్లు ఉండే అధునాతన కారును రూపొందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కారు నడిచేందుకు పెట్రోలు, డీజిల్‌ కాకుండా సౌరశక్తినే వినియోగించుకోవడం మరో విశేషం. 

కశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చెందిన బిలాల్‌ అహ్మద్‌ వృత్తిరీత్య గణిత శాస్త్ర బోధకుడు. అయితే చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్‌ ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ.  ముఖ్యంగా లగ్జరీ కార్లు అందులో ఫీచర్లను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే తనలాంటి సామాన్యులకు లగ్జరీ కార్లు అందుబాటులో లేకపోవడం లోటుగా తోచింది. దీంతో ఇంటర్నెట్‌లో వీడియోల ద్వారా సమాచారం సేకరిస్తూ సాధారణ కారుకే లగ్జరీ సౌకర్యాలు అమర్చే పనిలో పడ్డాడు.

సామాన్యులకు లగ్జరీ ఫీచర్లతో కారును తీసుకురావలే ఆశయంతో 2009 నుంచి బిలాల్‌ అహ్మద్‌ పని చేస్తున్నాడు. పదకొండేళ్ల శ్రమ ఫలించి ఇటీవల మోడిఫైడ్‌ లగ్జరీ ఫీచర్లతో కూడిన కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారులో లగ్జరీ ఫీచర్లకు తోడు మరొకటి ఫీచర్‌ కూడా జతయ్యింది. అదే సోలార్‌ పవర్‌. బడ్జెట్‌ ధరలో అధునాత కారు కోసం శ్రమించే క్రమంలో సోలార్‌ పవర్‌తో కారును తయారు చేసేందుకు బిలాల్‌ శ్రమించాడు. సౌర శక్తి కోసం కారుకు నలువైపులా సోలార్‌ ప్యానెళ్లు అమర్చాడు. అదే విధంగా పైకి తెరుచుకునే డోర్లు ఈ కారుకు కొత్త లుక్‌ తీసుకువచ్చాయి.

చదవండి: ఎలక్ట్రిక్ బైక్‌ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top