ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్‌లలో ఆఫీస్‌ వర్క్‌ చేసుకోవచ్చు

Japan Launches Office Cars For Employees - Sakshi

ప్రపంచ దేశాల్లో టెక్నాలజీతో పాటు అన్నీ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన వాహనల నుంచి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వరకు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ మారుతుంది. తాజాగా జపాన్‌ దేశం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులు ఆఫీస్‌ వర్క్‌ చేసేందుకు వీలుగా ఈస్ట్‌ జపాన్‌ రైల్వే సంస్థతో కలిసి 'ఆఫీస్‌ కార్స్‌'ను లాంఛ్‌ చేసింది. ఇప్పుడు ఈ బుల్లెట్‌ రైళ్లు కార్పొరేట్‌ ఆఫీసుల్ని తలపిస్తున్నాయి.  

ట్రైన్‌లలో ఆఫీస్‌ క్యాబిన్లు
జపాన్‌ ప్రభుత్వం షింకన్‌సెన్ బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో ఈ ఆఫీస్‌ కార్లును ప్రారంభించింది. దేశ రాజధాని టోక్యోతో పాటు దేశంలోని నార్తన్‌, సెంట్రల్‌ భాగాలను కలుపుతూ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫీస్‌ కార్స్‌లో అదనపు ఛార్జీలు  లేకుండా ఉద్యోగులు ఆఫీస్‌ పనులు చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రైన్‌లో ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం క్యాబిన్‌లను ఏర్పాటు చేసింది. ఫోన్ కాల్స్‌ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో జరిగే వర్చువల్‌ మీటింగ్స్‌ సైతం పాల్గొనేలా సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చినట్లు జపాన్‌ మీడియా 'జిన్హువా' తన కథనంలో పేర్కొంది.  

ఉద్యోగుల కోసం స్మార్ట్ గ్లాసెస్
ఈ ఆఫీస్‌ కార్స్‌లో ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను దగ్గరగా మరింత ఆసక్తికరంగా చూసేందుకు స్మార్ట్‌ గ్లాసెస్‌ను వినియోగించుకోవచ్చు. 'తోహోకు' బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో బుల్లెట్ రైళ్లలో సీట్ల చుట్టూ చిన్న డివైడర్‌లను ఉద్యోగులు ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే జపాన్‌ తెచ్చిన ఈ ఆఫీస్‌ కల్చర్‌ను వినియోగించుకునేందుకు ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. వారిని కట్టడి చేసేందుకు వీకెండ్స్‌ తో పాటు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్‌లో వర్క్‌స్పేస్‌ సేవల్ని నిలిపివేస్తూ జపాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోవిడ్‌ కారణంగా తగ్గిన వ్యాపార ప్రకటనల డిమాండ్‌ను పెంచేందుకు ఈ ఆన్‌లైన్‌ వర్క్‌ కల్చర్‌ తోడ్పడుతుందని ఈస్ట్‌ జపాన్‌ రైల్వే భావిస్తున్నాయి. కాగా ,సెంట్రల్ జపాన్ రైల్వే , వెస్ట్ జపాన్ రైల్వే సైతం అక్టోబర్ నుండి ప్రధాన నగరాల గుండా నడిచే రైళ్లలో ఆన్‌బోర్డ్ వర్క్‌స్పేస్‌లను ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top