ఐపీఎల్‌ మ్యాచ్‌లు కన్నార్పకుండా చూస్తూనే వీటి కోసం..

IPL 15 Edition Food tech companies getting more orders - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైన తర్వాత ఫుడ్‌టెక్‌ కంపెనీలు మంచి రోజులు వచ్చాయి. రెండున్నర నెలల పాటు జరగనున్న ఈ టో‍ర్నీ స్టార్టప్‌ కంపెనీలకు బూస్టింగ్‌ ఇస్తోంది. మ్యాచ్‌ జరిగే సమయంలో స్క్రీన్లకు కళ్లప్పగించేస్తున్న క్రికెట్‌ లవర్స్‌ ఫుడ్‌ కోసం కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌ వైపు చూడటం లేదు. సింపుల్‌గా ఫుడ్‌ టెక్‌ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. 

జోమాటో, స్విగ్గీలకే కాదు క్యూర్‌ఫుడ్‌, ఈట్‌క్లబ్‌, బిర్యానీ బై కిలో వంటి ఫుడ్‌టెక్‌ కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్‌లో 14 నుంచి 16 శాతం ఆర్డర్లు పెరిగినట్టు ఈ కంపెనీల ప్రతినిధులు ‍స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత ఆర్డర్లు జోరందుకుంటున్నాయి. ఇక రెండు మ్యాచ్‌లు ఉండే శని,ఆదివారాల్లో అయితే ఆర్డర్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

బిర్యానీలు, ఫ్రైడ్‌ రైస్‌లు, చపాతీలు, రోటీలు వంటి రెగ్యులర్‌ ఫుడ్‌ కాకుండా మల్టీ గ్రెయిన్‌ పిజ్జా, కుల్చా బర్గర్‌ వంటి వాటిని ఫుడ్‌ టెక్‌ కంపెనీలు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుడ్స్‌గా పరిగణిస్తుంటాయి. ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాత ఈ తరహా ఫుడ్స్‌కి ఫుల్‌ డిమాండ్‌ ఉందంటున్నాయి ఫుడ్‌ టెక్‌ కంపెనీలు. ముఖ్యంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల టైమ్‌లో ఎక్కువగా ఆర్డర్లు వస్తున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్‌, గుర్‌గ్రామ్‌ వంటి టెక్‌ ఎంప్లాయిస్‌ ఎక్కువగా ఉండే సిటీలు ఉండటం గమనార్హం.
 

చదవండి: మన పిల్లలేమీ శాండ్‌విచ్‌లు కాదు - రతన్‌టాటా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top