24 పరుగులకు ఐఫోన్‌ 15.. 36 పరుగులకు స్కోడా కారు!

Iphone15 For 24 Runs Skoda Car For 36 Runs - Sakshi

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్‌ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్‌ చేయనుంది. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్‌ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 19 వరకు క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. 

మ్యాచ్‌ డే మానియా ఆఫర్‌ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ధర ఆధారంగా వారి వాలెట్‌లో రన్స్‌ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్‌అవుట్‌ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు.  లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్‌హోటల్‌లో బస, తనిష్క్‌ వోచర్‌ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్‌ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top