Infinix GT10 Pro offers superior gaming performance at unbeatable price - Sakshi
Sakshi News home page

గేమింగ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌: ఇన్‌ఫినిక్స్‌ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!

Published Sat, Aug 5 2023 10:20 AM

Infinix GT10 Pro offers superior gaming performance unbeatable price - Sakshi

Infinix gt 10 pro: ఇన్‌ఫినిక్స్‌ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో  గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకునేలా  ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్‌ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్‌ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్‌ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్‌, సెల్ఫీ కెమెరా  2K వీడియో రికార్డింగ్‌ సదుపాయంతోపాటు  AI ఫిల్మ్ మోడ్‌ను కూడా  జోడించింది. 

ఇండియాలోదీని లాంచింగ్‌  ప్రైస్‌ రూ. 19,999గా ఉంది. అయితే  బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్‌లు ప్రో గేమింగ్ కిట్‌ను కూడా అందుకునోఛాన్స్‌  ఉంది.  సైబర్‌ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్‌ ట్రిపుల్‌ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, డ్యుయల్‌ 5జీ సిమ్‌ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్‌ కపూర్‌ తెలిపారు. ఇది సైబర్‌ బ్లాక్, మిరాజ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. 

జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్‌
6.67-అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
108+2+2 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌  కెమెరా
8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 
1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం
5000mAh బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
 
Advertisement