రూపాయి రక్షణలో.. మరింత తగ్గిన ఫారెక్స్‌, బంగారం నిల్వలు | Indias Forex Reserves Slide Further Amid Global Tensions | Sakshi
Sakshi News home page

రూపాయి రక్షణలో.. మరింత తగ్గిన ఫారెక్స్‌, బంగారం నిల్వలు

Apr 5 2026 2:25 PM | Updated on Apr 5 2026 3:45 PM

Indias Forex Reserves Slide Further Amid Global Tensions

ముంబై: అధిక చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ కాపాడే చర్యలు విదేశీ మారకం నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు (ఫారెక్స్‌) అంతకుముందు వారంతో పోల్చితే 10.29 బిలియన్‌ డాలర్లు తగ్గి 688.06 బిలయన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

గత వారంలోనూ ఫారెక్స్‌ నిల్వలు 11.41 బిలియన్‌ డాలర్లు తగ్గడం గమనార్హం. ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా యుద్ధానికి ముందు ఫిబ్రవరి 27న దేశ ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్టం 728.49 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వల్లో.. కరెన్సీ అసెట్స్‌ 6.62 బిలియన్‌ డాలర్లు తగ్గి 551.07 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

బంగారం నిల్వల విలువ 3.66 బిలియన్‌ డాలర్లు తగ్గి 113.52 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 17 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.64 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement