
భారతీయులు అలంకార ప్రియులనే విషయాన్ని చరిత్ర కారులు కొన్నేళ్ల క్రితమే తమ రచనల్లో పేర్కొన్నారు. అలంకారమంటే.. కేవలం కట్టు, బొట్టు మాత్రమే కాదు.. ఆభరణాలు కూడా. భారతీయులు ధరించినన్ని నగలు.. ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు ధరించరనే విషయం ఇప్పటికే చాలామంది వెల్లడించారు. ఇప్పుడు వరల్డ్ అప్డేట్స్ తన ఎక్స్ ఖాతాలో ఇదే విషయాన్ని వెల్లడించింది.
బంగారం అంటే.. ఒకప్పుడు కేవలం అలంకారం. ఈ రోజు అది అలంకారం మాత్రమే కాదు, ఒక మనిషి ఆర్ధిక స్థితి కూడా. వరల్డ్ అప్డేట్స్ ప్రకారం సుమారు 10 దేశాల్లో ఉన్న బంగారం కంటే.. ఇండియాలోని మహిళల దగ్గరే ఎక్కువ ఉందని పేర్కొంది.
➤భారతీయ మహిళల దగ్గరున్న బంగారం: 25,488 టన్నులు
➤యూఎస్ఏ: 8,133 టన్నులు
➤జర్మనీ: 3,351 టన్నులు
➤ఇటలీ: 2,451 టన్నులు
➤ఫ్రాన్స్: 2,437 టన్నులు
➤రష్యా: 2,332 టన్నులు
➤చైనా: 2,279 టన్నులు
➤స్విట్జర్లాండ్: 1,039 టన్నులు
➤జపాన్: 845 టన్నులు
➤నెదర్లాండ్స్: 612 టన్నులు
➤పోలాండ్: 448 టన్నులు
Breaking:
🇮🇳Indian women hold more Gold than 10 countries combined.
- 🇮🇳 Indian Women: 25,488 tonnes
- 🇺🇸 USA: 8,133 tonnes
- 🇩🇪 Germany: 3,351 tonnes
- 🇮🇹 Italy: 2,451 tonnes
- 🇫🇷 France: 2,437 tonnes
- 🇷🇺 Russia: 2,332 tonnes
- 🇨🇳 China: 2,279 tonnes
- 🇨🇭 Switzerland: 1,039… pic.twitter.com/64cyZNePUh— World updates (@itswpceo) October 21, 2025