breaking news
top country
-
ధనవంతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఎక్కడుందంటే?
ప్రపంచంలోని ధనవంతుల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,640 మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశమేది, చివరి స్థానంలో ఉన్న దేశమేది, ఇందులో ఇండియా స్థానం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్బ్స్ వెల్లడించిన నివేదికల ప్రకారం, అత్యధిక బిలినియర్లు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తమ్ 735 మంది బిలినియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులున్న దేశం అమెరికా అయినప్పటికీ ప్రపంచ ధనవంతుడు మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన వాడు కావడం గమనార్హం. ప్రపంచ జనాభలో మాత్రమే కాకుండా.. ఎక్కువ మంది బిలినీయర్లు ఉన్న దేశంగా చైనా రెండవ స్థానం ఆక్రమించింది. చైనాలో మొత్తం 495మంది ధనవంతులున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో వెల్లడైన జాబితాలో మొత్తం 539 మంది ధనవంతులను, దీన్ని బట్టి చూస్తే ఈ సరి చైనాలో ధనవంతుల సంఖ్య తగ్గింది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారత్, ధనవంతుల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మన దేశంలో మొత్తం 169మంది బిలినియర్లు ఉన్నట్లు సమాచారం. భారతేశంలో ఉన్న బిలినియర్ల సంపద సుమారు 675 బిలియన్ డాలర్లు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో జర్మనీ, రష్యా ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న బిలినియర్ల సంఖ్య వరుసగా 126, 105 మంది. జర్మనీలోని రిచెస్ట్ పర్సన్‌గా స్క్వార్జ్ గ్రూప్ అధినేత డైటర్ స్క్వార్జ్ నిలిచారు. ఆయన సంపద ప్రస్తుతం 42.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో దిగ్గజ వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చివరి స్థానంలో హంగేరి, స్విజర్లాండ్ వంటి దేశాలు 58వ స్థానంలో ఉన్నాయి. -
ఆ విషయంలో భారత్ నెంబర్ 1
ప్రపంచంలో అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇతర దేశాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే అత్యధికమంది ఉన్నారు. ఇతర దేశాల్లో కోటి 56 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు ప్యూ రీసెర్చ్ కేంద్రం వెల్లడించింది. అన్ని దేశాలకు చెందిన వలసదారుల సంఖ్య ప్రపంచ జనాభాలో 3.3 శాతం మంది ఉన్నట్టు అంచనా వేసింది. ప్యూ రీసెర్చ్ ప్రకారం గతేడాది యూఏఈలో 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా భారతీయులు భారీ సంఖ్యలో వలస వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో 1990 నాటికి 20 లక్షల మంది ఉండగా, 2015 నాటికి 80 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నట్టు అంచనా. గల్ఫ్ దేశాలకు చాలా వరకు ఉపాధి కోసం వలస వెళ్లారు. అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా మెక్సికో (కోటి 23 లక్షల మంది), రష్యా (కోటి 6 లక్షల మంది), చైనా (95 లక్షల మంది), బంగ్లాదేశ్ (72 లక్షల మంది) ఉన్నాయి. ఇక అత్యధికమంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన దేశాల్లో అమెరికాది మొదటి స్థానం. అమెరికాలో మొత్తం 4 కోట్లా 66 లక్షల మంది వలసదారులు ఉన్నారు. ఆ తర్వాత జర్మనీ (కోటి 20 లక్షల మంది), రష్యా (కోటి 16 లక్షల మంది), సౌదీ అరేబియా (కోటి 2 లక్షల మంది), బ్రిటన్ (85 లక్షల మంది) దేశాలు ఎక్కువ మంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చాయి.