2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్! | India Set to Become a Wealthy Nation by 2047 Washington Examiner | Sakshi
Sakshi News home page

2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!

Mar 22 2026 7:50 PM | Updated on Mar 22 2026 8:24 PM

India Set to Become a Wealthy Nation by 2047 Washington Examiner

వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్‌ను (మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్) దాటేయగలదు.

భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్‌కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.

ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.

నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.

వికసిత భారత్ - మోదీ కల
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.

వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.

మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.

ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement