టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు | India Expands PLI Scheme to MMF Technical Textiles Footwear Industry | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు

Apr 8 2026 12:48 PM | Updated on Apr 8 2026 1:31 PM

India Expands PLI Scheme to MMF Technical Textiles Footwear Industry

టెక్స్‌టైల్స్‌ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్‌ఐ) పరిధిలోకి మ్యాన్‌ మేడ్‌ వ్రస్తాలు (ఎంఎంఎఫ్‌), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్‌టైల్స్‌రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్‌వేర్‌ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్‌లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్‌లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement