ఈ-పాస్‌పోర్ట్‌ అర్హులు, దరఖాస్తు వివరాలు.. | India ePassport Launch Everything You Need to Know | Sakshi
Sakshi News home page

ఈ-పాస్‌పోర్ట్‌ అర్హులు, దరఖాస్తు వివరాలు..

Sep 18 2025 10:16 AM | Updated on Sep 18 2025 10:35 AM

India ePassport Launch Everything You Need to Know

దేశంలో అన్ని వ్యవస్థలూ డిజిటల్‌ వైపు పయనిస్తున్నాయి. ఇదే ఒరవడిలో ఇప్పటికే కొత్త పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి. పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద ఈ-పాస్‌పోర్ట్‌లను జూన్‌ 24, 2025 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ-పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన కొన్ని అంశాలను కింద తెలుసుకుందాం.

ఇంటిగ్రేటెడ్‌ చిప్‌

ఈ-పాస్‌పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్‌తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్‌పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎవరు అర్హులు

కొత్త పాస్‌పోర్ట్‌ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ పౌరులందరూ అర్హులు. చెన్నై, హైదరాబాద్‌, సూరత్, జైపూర్.. వంటి ఎన్నో నగరాల్లో ఎంపిక చేయబడిన పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు(పీఎస్‌కే)ల్లో ప్రాథమికంగా జారీ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

  • ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ సేవా అధికారిక పోర్టల్‌ ఓపెన్‌ చేయాలి.

  • వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.

  • కొత్త ఈ-పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కోసం అపాయింట్‌మెంట్‌ నిమిత్తం ఆన్‌లైన్‌లోనే మీ దగ్గరల్లో ఉన్న పీఎస్‌కే లేదా పీఓఎస్‌కేని ఎంచుకోవాలి.

  • ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

  • అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్ చేసుకోవాలి.

  • తదుపరి బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పీఎస్‌కేను సందర్శించాలి.

ప్రయోజనాలు

  • ఈ-గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వేగవంతం అవుతుంది.

  • ట్యాంపరింగ్, ఐడెంటిఫికేషన్‌ థెఫ్ట్‌ ఉండదు. మెరుగైన భద్రతను నిర్ధారిస్తుంది.

  • ఎన్‌క్రిప్టెడ్ చిప్ యాక్సెస్‌తో కాంటాక్ట్ లెస్ వెరిఫికేషన్.

  • డూప్లికేషన్ లేదా మోసాలని తగ్గిస్తుంది.

మొదట ఫిన్లాండ్‌లో..

అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్‌పోర్ట్‌లను ప్రారంభించిన మొదటి దేశం ఫిన్లాండ్. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్‌పోర్ట్‌లకు బదులుగా ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్‌, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది.

ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement