మౌలిక రంగాల జోరు  | India Eight Core Industries grew by 1. 7percent in April 2026 | Sakshi
Sakshi News home page

మౌలిక రంగాల జోరు 

May 21 2026 12:50 AM | Updated on May 21 2026 12:50 AM

India Eight Core Industries grew by 1. 7percent in April 2026

ఏప్రిల్‌లో 1.7 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: ఉక్కు, సిమెంటు, విద్యుదుత్పత్తి దన్నుతో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్‌ ఉత్పాదకత ఏప్రిల్‌లో మరింత మెరుగ్గా వృద్ధి చెందింది. రెండు నెలల గరిష్ట స్థాయి 1.7 శాతానికి చేరింది. గతేడాది ఏప్రిల్‌లో మౌలిక రంగ వృద్ధి 1 శాతంగాను, ఈ ఏడాది మార్చిలో 1.2 శాతంగాను నమోదైంది. తాజా సమీక్షాకాలంలో బొగ్గు, ముడి చమురు, నేచురల్‌ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల వృద్ధి మైనస్‌లోకి జారిపోయింది. ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్‌లో వరుసగా 6.2 శాతం, 9.4 శాతం, 4.1 శాతంగా ఉంది. లో బేస్‌ ఎఫెక్ట్, ఎరువుల ఉత్పత్తి పెరగడం ద్వారా మే నెలలో మౌలిక రంగం వృద్ధి మరింత మెరుగ్గా 3 శాతం నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ డైరెక్టర్‌ మేఘా ఆరోరా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement