వ‌న్ ట్రిలియ‌న్ దిశ‌గా ఇంట‌ర్నెట్ ఆర్ధిక వ్య‌వ‌స్థ, ఆమూడు వ‌ర్గాల ప్ర‌జ‌లే కీల‌కం!

India To Become A 1 Trillion Internet Economy By 2030 Says Redseer - Sakshi

Indian Internet Economy 2030 Forecast: మ‌న‌దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి  వ‌న్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్ర‌ముఖ క‌న్స‌ల్టింగ్ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది. రెడ్‌సీర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గ‌తేడాది 50శాతం వృద్ధితో ముందుకు సాగిన దేశ ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వ‌న్‌ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఇంటర్నెట్ వ్యాప్తి రేటు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్,పెరిగిన ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ కంటెంట్ వినియోగంతో ఆర్ధిక వ్య‌వ‌స్థ వేగ‌వంతం అయ్యేందుకు ఆజ్యం పోసినట్లు అధ్యయనం తెలిపింది. 

రెడ్‌సీర్ సీఈఓ, వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ..వ‌న్ ట్రిలియన్ వినియోగదారుల ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థకు ఇ-టైలింగ్, ఇ-హెల్త్, ఫుడ్‌టెక్, ఆన్‌లైన్ మొబిలిటీ, క్విక్ కామర్స్ వంటి  రంగాలు వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిని సృష్టించడానికి కార‌ణ‌మైంద‌ని అన్నారు.  

ఈ సందర్భంగా నివేదిక దేశంలో ఇంట‌ర్నెట్‌ వినియోగ‌దారుల్ని మూడు విభాగాలు విభ‌జించింది. ఈ మూడు వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, వారి జీత‌భ‌త్యాలు, ఇంట‌ర్నెట్ తో ఎలాంటి అవ‌స‌రం ఉంది? ఇంట‌ర్నెట్ తో వారి సమ‌స్య‌ల్ని ఎలా ప‌రిష్క‌రించ‌వ‌చ్చు. ఇలా  ప‌లు అంశాల ఆధారంగా ఇంట‌ర్నెట్ ఆర్ధిక వ్య‌వ‌స్థ ఎలా వృద్ధి సాధిస్తుందో రెడ్‌సీర్ నివేదిక‌ను విడుద‌ల చేసింది. 

వాటిలో మొదటిది మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివ‌సించే 80-100 మిలియన్ల జనాభా కలిగిన మ‌న‌దేశానికి చెందిన వాళ్లు సంవ‌త్స‌రానికి 12వేల డాల‌ర్ల‌(రూ.9,04,182.00 ఇండియ‌న్ క‌రెన్సీ ) కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని పొందుతారు.   

రెండవ విభాగంలో 100-200 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న వీరు  సంవ‌త్స‌రానికి  5వేల నుండి 12వేల డాల‌ర్ల వ‌ర‌కు వరకు పొందేవారు. 

మూడవ వర్గం 400-500 మిలియన్ల జనాభా క‌లిగిన గ్రామీణ ప్రాంతాలు, టైర్-2 నగరాలు. వీరు ప్రాథమిక వార్షిక ఆదాయం 5వేలడాల‌ర్లు ( రూ.3,76,742.50 ఇండియ‌న్ క‌రెన్సీ). ఇంట‌ర్నెట్ ఆర్ధిక వ్య‌వ‌స్థ మ‌రింత అభివృద్ధి చెంద‌డానికి స‌హాయ‌ప‌డే విభాగం.వారి సమస్యలను పరిష్కరించేలా వారికి సహాయం చేసేందుకు ఇంట‌ర్నెట్ చాలా అవసర‌మ‌ని రెడ్ సీర్ తెలిపింది. 

ఈ మూడు విభాగాల‌కు చెందిన ప్ర‌జ‌ల జీవ‌న విధానం ఇంట‌ర్నెట్ ఆర్ధిక వ్య‌వ‌స్థ పుంజుకుంటుందని రెడ్ సీర్ రిపోర్ట్ హైలెట్ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top