
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భారతదేశపు అత్యంత డైనమిక్ పట్టణ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నట్లు ఏఎస్‌బీఎల్ వ్యవస్థాపక సీఈఓ అజితీష్ కోరుపోల్ అన్నారు. వాణిజ్య వృద్ధికి మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పట్టణ జీవనాన్ని పునర్నిర్వచిస్తోందన్నారు. ఇక్కడ 1,700 చదరపు అడుగుల 3బీహెచ్‌కే 2,000 చదరపు అడుగుల యూనిట్‌కు సమానమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుందని చెప్పారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కార్పొరేట్ కార్యాలయాల సమీపంలో నివసిస్తూ వాక్-టు-వర్క్ జీవనశైలి పెరుగుతోందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న అద్దె మార్కెట్, సాంకేతికతతో ఈ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కనెక్టివిటీ, సమీప కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, అద్దె రాబడి, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఈ ప్రాంతం కీలకంగా మారిందని చెప్పారు. కేపీహెచ్‌బీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను అనుసంధానించే మెట్రో రాబోయే రెండో దశతో ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందుతాయని అంచనా వేశారు.
హైదరాబాద్ ఓవైపు కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగి వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతోపాటు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాలు, జీవనశైలి ప్రయోజనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. ఏఎస్‌బీఎల్ లాఫ్ట్ ప్రాజెక్ట్ గురించి అజితీష్ మాట్లాడుతూ ఎమర్జింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మైక్రో మార్కెట్‌కు సరిపోయేలా అన్ని మౌలిక సదుపాయాలతో 5 ఎకరాల పరిధిలో ఇది విస్తరించి ఉందన్నారు. ఏఎస్‌బీఎల్ లోఫ్ట్‌లో 45 అంతస్తులతో రెండు టవర్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 894 యూనిట్లతో 1700 చదరపు అడుగుల నుంచి 1900 చదరపు అడుగుల చొప్పున ఉన్నాయని తెలిపారు.