హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్‌, ఏకంగా 130 శాతం జంప్‌

Housing Sales130 pc Rise In In Hyderabad - Sakshi

6 నెలల్లో  22,840 గృహాలు

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గృహ విక్రయాలతో పాటు వాటి విలువలు కూడా పెరుగు తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొదటి ఏడు నగరాల్లో విక్రయించిన రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆసక్తికరంగా, ఈ కాలంలో హైదరాబాద్ మొత్తం గృహాల విక్రయ విలువలలో 130 శాతం జంప్‌ చేశాయి. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం (హెచ్‌1)లో నగరంలో రూ.15,958 కోట్ల విలువ చేసే 22,840 ఇళ్లు అమ్ముడుపోయాయి. అదే 2022 ఫైనాన్షియల్‌ ఇయర్‌ హెచ్‌1లో రూ.6,926 కోట్ల విలువైన 9,980 యూనిట్లు విక్రయమయ్యాయి. ఏడాదిలో 130 శాతం వృద్ధి రేటు నమోదైందని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2023 హెచ్‌1లో రూ.1.56 లక్షల కోట్ల విలువ చేసే 1,73,155 యూనిట్లు సేలయ్యాయి. 2022 హెచ్‌1లో 87,375 యూనిట్లు సేలయ్యాయి. వీటి విలువ రూ.71,295 కోట్లు. అంటే ఏడాదిలో 119 శాతం వృద్ధి రేటు.

ఇదీ చదవండి: యాపిల్‌ గుడ్‌న్యూస్‌: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!

అత్యధికంగా ముంబైలో రూ.74,835 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఎన్‌సీఆర్‌లో రూ.24,374 కోట్లు, బెంగళూరులో రూ.17,651 కోట్లు విలువ చేసే గృహాలు విక్రయమయ్యాయి. గృహ విలువల వృద్ధి అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో నమోదయింది. 2022 ఆర్ధిక సంవత్సరం హెచ్‌1లో ఎన్‌సీఆర్‌లో రూ.8,896 కోట్లు విలువ చేసే ఇళ్లు విక్రయం కాగా.. 2023 హెచ్‌1 నాటికి 175 శాతం వృద్ధి రేటుతో రూ.24,374 కోట్లకు చేరింది
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top