ఫైర్‌ఫాక్స్‌ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేయండి?

Govt Issues Urgent Warning for Mozilla Firefox Users - Sakshi

ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ వినియోగిస్తున్న యూజర్లను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్) మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో పలు భద్రతా లోపాలను కనుగొన్నట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల వల్ల యూజర్ అనుమతి లేకుండానే కీలక సమాచారాన్ని హ్యకర్ చేతికి చెరవేస్తున్నట్లు సీఈఆర్ టీ-ఇన్ పేర్కొంది. తాజాగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 98 అప్‌డేట్‌కు రాకముందు.. అన్ని మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్‌లు ఈ భద్రతా లోపాలతో ప్రభావితమైనట్లు భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. 

అదనంగా, 91.7 వెర్షన్‌కి ముందు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఈఎస్ఆర్ వెర్షన్‌లు 91.7కి ముందున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ థండర్‌బర్డ్ వెర్షన్‌లు కూడా ఇలాంటి భద్రతా లోపాలను ఎదుర్కొంటున్నాయి. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ‘ఉచిత ఇన్-టెక్స్ట్ రీఫ్లోలు(use-after-free in-text reflows), థ్రెడ్ షట్‌డౌన్, యాడ్-ఆన్ సిగ్నేచర్ వెరిఫై సమయంలో టైమ్-ఆఫ్-చెక్ టైమ్-యూజ్ బగ్, శాండ్‌బాక్స్ చేసిన iframe కంటెంట్‌లను నియంత్రిస్తోంది. ఈ లోపం కారణంగా Mozilla ప్రొడక్టుల్లో అనేక భద్రతా లోపాలు తలెత్తుతున్నట్లు భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మీరు గనుక ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ని ఇప్పటివరకూ అప్‌డేట్ చేయలేదంటే వెంటనే చేయండి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఎలా అప్‌డేట్ చేయాలి?

  • మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయండి..
  • ఫైర్‌ఫాక్స్ టూల్‌బార్ కుడి వైపున ఉన్న మెనూ బటన్‌ను క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు Help ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఫైర్‌ఫాక్స్ ఏబౌట్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఫైర్‌ఫాక్స్ అప్‌డేట్స్ కోసం సర్చ్ చేయండి.
  • అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. బ్రౌజర్ ఆటోమాటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
  • డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత ఫైర్‌ఫాక్స్'ని Restart to Update క్లిక్ చేయండి.

(చదవండి: చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top