విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌! ఎయిర్‌లైన్స్‌కు పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌

Good news For Flight Passengers IATA tie up with payment platform - Sakshi

జతకట్టిన స్టాన్‌చార్ట్, ఐఏటీఏ 

ముంబై: దేశీ విమానయాన పరిశ్రమ కోసం పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ)తో చేతులు కలిపినట్లు గ్లోబల్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ స్టాన్‌చార్ట్‌ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న క్రెడిట్‌ కార్డులు తదితర అవకాశాలుకాకుండా ఐఏటీఏ పే ద్వారా కొత్తతరహా ఇన్‌స్టంట్‌ చెల్లింపులకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. 

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా యూపీఐ స్కాన్, పే, యూపీఐ కలెక్ట్‌ తదితరాలతో చెల్లింపులకు విమానయాన సంస్థలు వీలు కల్పించనున్నట్టు పేర్కొంది. ఈ తరహా సేవలు ఇప్పటికే యూరోపియన్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది. రియల్‌ టైమ్‌ చెల్లింపుల దేశీ పథకం యూపీఐ అండతో కస్టమర్లు విమాన టికెట్ల కొనుగోలుకి తమ బ్యాంకు ఖాతాల నుంచి అప్పటికప్పుడు చెల్లించేందుకు వీలు కలి్పంచనున్నట్లు వివరించింది. ప్లాట్‌ఫామ్‌ను దేశీయంగా ప్రారంభించాక ఐఏటీఏ ఈ సర్వీసులను ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరించేందుకు మద్దతివ్వనున్నట్లు స్టాన్‌చార్ట్‌ పేర్కొంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top