సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!

Gold, Silver Rates Edge Higher In Volatile Trade on March 3rd - Sakshi

బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో గోల్డ్ ధర 0.05 శాతం పెరిగి ₹51,840 వద్ద ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం రోజు రోజుకి మరింత తీవ్రతరం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు పెట్రోల్, బంగారం ధరల మీద భారీగా పడింది. దీంతో, అంతర్జాతీయంతో పాటు దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. రూపాయి విలువ క్షీణించడం కూడా పుత్తడి ధరలు పెరిగడానికి ఒక కారణం అని నిపుణులు భావిస్తున్నారు.

ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛతతో కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹51,567కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పైగా పెరిగి ₹47,235కు చేరుకుంది. అలాగే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46700 నుంచి రూ.47,700కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.1000 పెరిగింది అన్నమాట.

ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.1090 పెరిగి రూ.52,040కి చేరుకుంది. అలాగే, ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1700కి పైగా పెరిగి రూ.₹67,030కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. 

(చదవండి: యూజర్ల మతిపోగొడుతున్న జీప్ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు..!)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top