భారత్‌ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!

Global Macro Headwinds May Moderate Growth For Indian IT Services Industry In Mid-Term - Sakshi

మధ్యకాలిక పరిస్థితిపై ఐసీఆర్‌ఏ నివేదిక

ప్రపంచ ఆర్థిక అనిశ్చితే కారణం

అయితే స్టేబుల్‌ అవుట్‌లుక్‌ యథాతథం  

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్‌ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్‌ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్‌ మార్కెట్‌ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్‌ మార్కెట్లలో  నియంత్రణాపరమైన మార్పులు భారత్‌ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్‌ఏ అసిసెంట్‌ వైస్‌ప్రెసిడెంట్, సెక్టార్‌ హెడ్‌ దీపక్‌ జట్‌వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

► సవాళ్లు ఉన్నప్పటికీ,  ఐటీ రంగం అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్‌’గానే ఉంచడం జరుగుతోంది.  పలు కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం.  
► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ  (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇ న్సూ­రెన్స్‌) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్‌ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే.  
► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్‌ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది.  
► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్‌–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్‌ టెక్‌ విభాగంలో ఈ సమస్య ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top