breaking news
Indian IT services
-
క్యూ4లో ఐటీ డీలా!
ముంబై: భారతీయ ఐటీ సేవల రంగం 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని నిస్తేజంగా ముగించే అవకాశముందని బ్రోకరేజ్ సంస్థల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో (క్యూ4) త్రైమాసికవారీ(సీక్వెన్షియల్) వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. అయితే రూపాయి బలహీనత అనుకూలతకావడంతో వార్షిక ప్రాతిపదికన కొంత మెరుగుదల కనిపించవచ్చని పేర్కొంటున్నారు. డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, జనరేటివ్ ఏఐ వల్ల ధరలు నిర్ణయించే విధానంలో మార్పులు, ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనిశ్చితి పెరుగుతోందని వివరించారు. మార్చి త్రైమాసిక ఫలితాల కంటే, ఆర్థిక సంవత్సరం 2026–27 అంచనాలు(గైడెన్స్)పైనే మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైనట్లు తెలియజేశారు. ప్రధానంగా వృద్ధి అవకాశాలపై స్పష్టత, ఆదాయంపై ఏఐ ప్రభావాలు, మార్జిన్ల నిలకడకు ప్రాధాన్యమున్నట్లు అభిప్రాయపడ్డారు.వృద్ధి మందగమనం, ఏడాది చివర్లో రికవరీత్రైమాసిక ప్రాతిపదికన (సీక్వెన్షియల్‌గా) చూస్తే, ఎఫ్వై 26 నాలుగో త్రైమాసికం (క్యూ4) పనితీరు నిరుత్సాహకరంగానే ఉండవచ్చని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. టైర్–1 ఐటీ కంపెనీల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ‘‘స్థిర మారకపు విలువల ఆధారంగా టైర్–1 కంపెనీల వృద్ధి –1.1 శాతం నుంచి 0.9 శాతం మధ్య ఉండవచ్చు. మధ్యస్థాయి (మిడ్–టైర్) కంపెనీల వృద్ధి –1.8 శాతం నుంచి 3.4 శాతం వరకు ఉండొచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా క్యూ4ను ‘సాధారణ త్రైమాసికం’గానే అభివర్ణించింది. పెద్ద కంపెనీల (లార్జ్ క్యాప్) వృద్ధి –1.0 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండవచ్చని, మిడ్–క్యాప్ కంపెనీలు మాత్రం మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తాయని పేర్కొంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో (క్యూ4) సెలవులు లేదా తాత్కాలిక విరామాలు లేకపోవడం కొంత మద్దతు ఇచి్చంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్ రంగాలకు ఇది ఉపయోగపడింది. అయితే తక్కువ పని దినాలు, ఐచ్చిక ఖర్చులపై (డి్రస్కిషనరీ స్పెండింగ్) కొనసాగుతున్న అప్రమత్తత వైఖరి కారణంగా ఈ ప్రభావం కొంత మేర తగ్గింది. ఇక నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రధానంగా డీల్‌ల విస్తరణ, విలీనాలు/కొనుగోళ్లు వల్లనేనని, డిమాండ్ పెరుగుదల వల్ల కాదని బ్రోకరేజ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మార్జిన్లకు కరెన్సీ ఆసరాదేశీయ ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికంలో (క్యూ4) మార్జిన్లు స్థిరంగా ఉండే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. రూపాయి బలహీనత కారణంగా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, కోటక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ ప్రభావంతో 35 నుంచి 320 బేసిస్ పాయింట్ల వరకు మార్జిన్ విస్తరణ సాధ్యమని భావిస్తున్నాయి. అయితే ఇది స్థిరమైన వృద్ధి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, కొత్త డీల్‌ల ప్రారంభ ఖర్చులు, ఉత్పాదకత ఆధారిత ధరల విధానం మార్జిన్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద, స్వలకాలంలో రూపాయి బలహీనత మార్జిన్లకు కొంత ఊరటనిచి్చనా, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విలీనాలు–కొనుగోళ్లు, నియామకాల ప్రభావంప్రధాన ఐటీ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో భారీగా విలీనాలు, కొనుగోళ్లు (ఎం–ఏ) చేపట్టాయి. టీసీఎస్ కూడా దశాబ్దం తర్వాత ఈ దిశగా అడుగుపెట్టింది. కృత్రిమ మేధ, డేటా, సెమీకండక్టర్ల వంటి అనుబంధ సామర్థ్యాల కోసం ఈ కొనుగోళ్లు జరిగాయి. అయితే జనరేటివ్ ఏఐ ప్రభావంతో ఈ సామర్థ్యాలపై కూడా డిఫ్లేషన్ ఒత్తిడి ఉండొచ్చని కోటక్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనాలు, కొనుగోళ్లు ఆదాయ వృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయన్నది కీలకం. ఇదే సమయంలో కంపెనీల్లో నియామకాలు మందగించే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా సంస్థలు ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాయి. తాజా నియామకాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.ఏఐ ప్రభావంతో వాల్యుయేషన్లకు కొత్త సవాలుకృత్రిమ మేధ కారణంగా ఏర్పడే ‘ధరల తగ్గుదల’ (డిఫ్లేషన్) అనేది మధ్యకాల ఆందోళన నుంచి ఇప్పుడు ఐటీ రంగం వాల్యుయేషన్లు, భవిష్యత్ అంచనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ‘‘ఈ డిఫ్లేషన్ భయాలతో ఐటీ షేర్లలో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. ఐటీ సేవల ఫీజు ఇప్పుడు ‘ఏజెంట్–ఆగ్మెంటెడ్’ (ఏఐ సహాయంతో నిర్ణయించబడే విధంగా) మారుతుండగా, ఒప్పందాల పునరుద్ధరణలు తగ్గింపు ధరలతో జరుగుతున్నాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘‘ఏఐ ప్రభావం తక్షణ ఫలితాలకంటే భవిష్యత్ మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల ప్రధాన ప్రశ్న ఏఐ ప్రభావం ఉంటుందా కాదా అనేది కాదు; కంపెనీలు కొత్త ఏఐ ఒప్పందాల ద్వారా ఈ డిఫ్లేషన్ ప్రభావాన్ని ఎంత త్వరగా తగ్గించగలవన్నదే కీలకం’’ అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.యుద్ధం ఎఫెక్ట్...ఆర్థిక సంవత్సరం 2026 తొలి మూడు త్రైమాసికాల్లో టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్ వంటి దిగ్గజాలు బలమైన ఆర్డర్‌బుక్స్‌తో ఆర్థిక సంవత్సరం 2027 వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.., పల్చిమాసియా యుద్ధం తీవ్రతరమవడంతో పరిస్థితి మారింది. భారత ఐటీ కంపెనీలకు కీలకమైన క్లయింట్ సెగ్మెంట్లపై యుద్ధ ప్రభావం పడే అవకాశముంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్ణయాలలో జాప్యం, ఏఐ డిఫ్లేషన్ ప్రభావంపై మేనేజ్మెంట్ వ్యాఖ్యలు ముఖ్యమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఖర్చు తగ్గింపునకు దారి తీసే అవకాశాలు తక్కువేనని కోటక్ అభిప్రాయపడింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2027 డిమాండ్‌పై స్పష్టత ఇంకా అనిల్చితంగానే ఉంది. -
భారత్ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్ మార్కెట్ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్ మార్కెట్లలో నియంత్రణాపరమైన మార్పులు భారత్ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్ఏ అసిసెంట్ వైస్‌ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ దీపక్ జట్వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సవాళ్లు ఉన్నప్పటికీ, ఐటీ రంగం అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’గానే ఉంచడం జరుగుతోంది. పలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం. ► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇ న్సూరెన్స్) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే. ► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది. ► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్ విభాగంలో ఈ సమస్య ఉంది. -
'ఐటీ ఇండస్ట్రి పండుగ చేసుకోవాలి'
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల్లో తీసుకుంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటీ సర్వీసులు వణికిపోవాల్సిన పనిలేదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకుంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలే తప్ప దాన్ని కార్మికుల బేరసారాలుగా వ్యాఖ్యానించాల్సిన పనిలేదన్నారు. టీసీఎస్ ఒక ఉత్పత్తులు తయారుచేసే సంస్థగా కాకుండా.. ఖర్చును తగ్గించుకోవడానికి ఎందుకు ఎక్కువగా దృష్టిసారిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖరన్ ఈ సమాధానమిచ్చారు. నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరమ్‌లో పాల్గొన్న చంద్రశేఖరన్, వివిధ రకాల పరిశ్రమల్లో, భౌగోళిక ప్రాంతాల్లో కొత్త అవకాశాలను ఇండస్ట్రి వెలికి తీయాల్సి ఉందని చెప్పారు. హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, వీసా ధరలు పెంచడం ఇవేమి దేశీయ ఐటీ ఇండస్ట్రికి సవాళ్లు కాదని, ఇవి కొత్త కొత్త అవకాశాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఐటీ సర్వీసులు వర్క్ చేసే విధంగా, ఇప్పటికీ వెలికితీయని వాటిని అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హెచ్-1బీ వీసాల్లో నిబంధనలు మార్చిన ప్రతీసారి, దేశీయ ఐటీ ఇండస్ట్రి చిక్కుల్లో పడుతుందని వార్తలు వస్తుంటాయి, కానీ ఇవి పరిశ్రమకు అత్యంత ఉత్తేజకరమని పేర్కొన్నారు. పరిశ్రమను మరింత విస్తరించడానికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో సహకరిస్తుందన్నారు. ''మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదాన్ని భారతీయులు ఎందుకు రూపొందించలేకపోయారని అడగటం కాదు.. మరో టీసీఎస్‌ని నీవెందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్‌ని ప్రశ్నించాలి'' అని చంద్రశేఖరన్ సవాల్ విసిరారు.


