అంబానీ యాంటిలియాలో ఫుట్‌బాల్ లెజెండ్ 'బెక్‌హామ్‌' - ఫోటోలు వైరల్

Football Legend David Beckham Ambani House In Mumbai - Sakshi

భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' ఇటీవల ఫుట్‌బాల్ లెజెండ్ 'డేవిడ్ బెక్‌హామ్‌'కు తన యాంటిలియాలో ఆతిధ్యమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గట్టి విజయం సాధించిన తర్వాత డేవిడ్ బెక్‌హామ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో థ్రిల్లర్ మ్యాచ్‌ను వీక్షించారు.

డేవిడ్ బెక్‌హామ్‌కు అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం, యాంటిలియాలో ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో నీతా అంబానీ, కుమార్తె ఇషా, కుమారుడు ఆకాష్‌తో కలిసి శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. వాంఖడే స్టేడియంలో ఆకాష్ అంబానీ, డేవిడ్ బెక్‌హామ్ కలిసి మ్యాచ్ వీక్షించారు. నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ ఇక్కడ హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్!

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా డేవిడ్ బెక్‌హామ్‌కి వారి ముంబై నివాసంలో వెల్‌కమ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, కరిష్మా కపూర్‌లతో సహా పలువురు బాలీవుడ్ తారలు మిస్టర్ బెక్‌హామ్‌తో హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top