HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్‌ల వంతు

FMCG Major Hindustan Unilever Has Hiked Prices - Sakshi

ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున​ సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు సిద్ధంగా ఉంది. పామాయిల్‌ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటగదిని దాటి బాత్‌రూమ్‌ని చేరాయి. ఇప్పటికే వంట నూనెల ధరతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు సబ్బులు మరో షాక్‌ ఇవ్వనున్నాయి.

పామ్‌ ఆయిల్‌ ఎఫెక్ట్‌
సబ్బు తయారీలో పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తులు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా పామ్‌ ఆయిల్‌ దిగుబడి తగ్గిపోయింది. దీంతో పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఈ కారణాన్ని చూపుతూ స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, డిటర్జెంట్‌ పౌడర్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి.

యూనీలీవర్‌ నిర్ణయం
దేశంలోనే అతి పెద్ద ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సుమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ అయిన హిందూస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ తన ఉత్పత్తులపై రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు సీఎన్‌బీసీ పేర్కొంది. స్నానపు సబ్బులు, డిటర్జెంట్‌ సబ్బులు, పౌడర్ల ధరలను కనీసం 3.5 శాతం నుంచి 14 శాతం వరకు పెంచేందుకు సిద్ధమైంది. 

గ్రాముల్లో తగ్గింపు
ప్రీమియం కేటగిరి, ఎక్కుడ డిమాండ్‌ ఉన్న ఐటమ్స్‌ విషయంలో ధరలు పెంచేందుకు హిందూస్థాన్‌ యూనిలీవర్‌ మొగ్గుచూపుతుండగా సాచెట్స్‌, తక్కువ ధరకు లభించే ఐటమ్స్‌ విషయంలో ధరల పెంపుకు సుముఖంగా లేదు. అయితే ధరల పెంపుకు బదులు ఆయా వస్తువుల సైజు తగ్గించాలని నిర్ణయించింది. అల్పాదాయ వర్గాలకు చెందిన వినియోగదారుడిపై నేరుగా భారం పడకుండా గ్రాముల్లో కోత విధించనుంది.

చదవండి: ఇకపై వాటిని మిల్క్‌ అంటే కుదరదు! ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top