ఆఫీస్‌లో నోటీసులు.. షాక్‌లో ఉద్యోగులు | Employees To Stop Time Clock Fraud | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌లో నోటీసులు.. షాక్‌లో ఉద్యోగులు

Apr 6 2024 8:26 PM | Updated on Apr 7 2024 3:47 PM

Employees To Stop Time Clock Fraud - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్‌ మేనేజ్మెంట్‌ ‘టైమ్‌ క్లాక్‌ ఫ్రాడ్‌’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.  

ఓ రెడ్డిట్‌ యూజర్‌ హెచ్‌ఆర్‌ విభాగం జారీ చేసిన మెమోని షేర్‌ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది.  

ఈ నియమాలలో భాగంగా ఆఫీస్‌ వర్క్‌ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార‍్యకలాపాలు, బ్యాగ్‌, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్‌ చేసింది. 

దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్‌ లాస్‌ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్‌లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement