
భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ‘ఈ-ఆధార్’యాప్‌ను ఉపయోగించి సులువుగా ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ యాప్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు అంచనాలున్నాయి.
ఈ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయగల వ్యక్తిగత వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పేరు
చిరునామా
పుట్టిన తేదీ
మొబైల్ నంబర్
బయోమెట్రిక్ మార్పులు (వేలిముద్ర / కనుపాపలు) మినహా, ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించకుండా అన్ని అప్‌డేట్‌లను డిజిటల్‌గా చేయవచ్చు.
ముఖ్య లక్షణాలు
ఏఐ ఫేస్ ఐడీ ఇంటిగ్రేషన్: సురక్షితమైన రిమోట్ యాక్సెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అనుమతిస్తుంది.
క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్: భౌతిక ఆధార్ ఫొటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది.
ఆటో డాక్యుమెంట్ పొందడం: పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పీడీఎస్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, యుటిలిటీ రికార్డుల నుంచి వెరిఫై చేసిన డేటాను తీసుకుంటుంది.
ఇది ఎందుకు ముఖ్యం?
పేపర్ వర్క్, క్యూలు, మోసపూరిత నమోదులను తగ్గిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో 130 కోట్ల మందికి పైగా ఆధార్ హోల్డర్లకు సాధికారత లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కింద భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ ప్రోత్సాహానికి అనుగుణంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ-పాస్‌పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..