
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన.. ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. ట్రైన్ల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. పండుగల సీజన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ సాహసించి టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్‌పై WL, PQWL, GNWL, RSWL వంటి పదాలు కనిపించే ఉంటాయి. ఇవి మీ బుకింగ్ స్థితిని సూచిస్తాయి. అంతే కాకుండా రైలులో మీకు సీటు లభిస్తుందో లేదో నిర్ణయిస్తాయి. ఈ పదాల అర్థం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
డబ్ల్యుఎల్ (WL): డబ్ల్యుఎల్ అంటే వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే మీరు వెయిటింగ్ టిస్టులో ఉన్నారని ఈ పదం సూచిస్తుంది. టికెట్స్ కన్ఫర్మ్ అయిన వారు ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మీకు సీటు లభించే అవకాశం ఉంటుంది.
జీఎన్‌డబ్ల్యూఎల్ (GNWL): GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ఇలా ఉంటే.. మీకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జనరల్ వెయిటింగ్ లిస్ట్.. అనేది ప్రారంభ స్టేషన్ లేదా సమీపంలోని ఏదైనా ఇతర ప్రధాన స్టేషన్ నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది. ఇతర వెయిటింగ్ లిస్ట్ బుకింగ్‌లతో పోలిస్తే GNWL టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
పీక్యూడబ్ల్యుఎల్ (PQWL): PQWL అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే ఇలాంటి టికెట్లకు సీటు కన్ఫర్మ్ అవకాశం చాలా తక్కువ. రైలు నిలిచిపోయే స్టేషన్‌కు ఒకటి రెండు స్టేషన్ల ముందు వరకు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్‌లకు ఈ లిస్టును చూపిస్తారు.
ఆర్ఎస్డబ్ల్యుఎల్ (RSWL): RSWL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. ఇందులో కూడా సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.