భారీ పెట్టుబడులకు నిఫ్టీ మిడ్‌క్యాప్‌150 ఇండెక్స్‌ ఫండ్స్‌

Details about Nifty Midcap 150 Index funds - Sakshi

మార్కెట్‌ కరెక్షన్లలో లంప్‌సమ్‌గా (ఒకే విడత వీలైనంత పెట్టుబడి) పెట్టుబడి పెట్టాలనుకునే వారి ముందు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఈ సమయంలో పరిశీలించొచ్చు. ఈ విభాగంలో పెట్టుబడికి తక్కువ పథకాలే అందుబాటులో ఉన్నాయి. అందులో మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ కూడా ఒకటి. ఈ విభాగంలో దీర్ఘకాలం ట్రాక్‌ రికార్డు కలిగిన పథకాలు లేవు. ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. 

పెట్టుబడులకు వైవిధ్యం 
నిఫ్టీ టాప్‌ 100 స్టాక్స్‌ అన్నవి లార్జ్‌క్యాప్‌ కంపెనీలు. వీటిల్లో దేశ, విదేశీ సంస్థలకు గణనీయమైన వాటాలే ఉన్నాయి. అందుకని లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోనే పెట్టుబడులన్నీ పెట్టేస్తే ఓవర్‌లాŠయ్‌ప్‌ సమస్య ఏర్పడుతుంది. అంటే ఒకే కంపెనీల్లో వివిధ పథకాల రూపంలో పెట్టుబడులను కలిగి ఉండడం. అందుకని పెట్టుబడుల వైవిధ్యానికి మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ను కూడా జోడించుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250 వరకు వరుసలో ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్‌ విభాగం కిందకు వస్తాయి. ఆయా స్టాక్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. 

పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం 
విడిగా మిడ్‌క్యాప్‌ ఫండ్‌కు, నిఫ్టీ 150 మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించినట్టయితే.. నిఫ్టీ 150 మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌లో ఒకే రంగానికి, ఒకే స్టాక్‌కు ఎక్కువ కేటాయింపులన్నవి ఉండవు. ప్రస్తుతం నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ను పరిశీలించినట్టయితే అందులో ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌కు 16.2 శాతం, కన్జ్యూమర్‌ గూడ్స్‌కు 10.9 శాతం, ఇండస్ట్రియల్‌ తయారీకి 9.9 శాతం, ఆటోమొబైల్స్‌కు 8.7 శాతం, ఐటీకి 8 శాతం చొప్పున వెయిటేజీ ఉంది. విడిగా యాక్టివ్‌ మిడ్‌క్యాప్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తే.. అవి ఒక్కో స్టాక్‌కు 9–10 శాతం వరకు కేటాయింపులు చేస్తుంటాయి. కానీ, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 పథకంలో అలా ఉండదు. ఒక సాŠట్‌్కకు వెయిటేజీ 3 శాతం మించి లేదు.
 
రాబడులు 
మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్‌ 2019 సెపె్టంబర్‌లో మొదలైంది. ఈ విభాగంలో రెండేళ్ల చరిత్ర కలిగిన పథకం ఇదొక్కటే. గడిచిన ఏడాది కాలంలో 16 శాతం రాబడినిచి్చంది. ఆరంభం నుంచి చూసుకుంటే రాబడి రేటు 29 శాతంగా ఉంది. నిఫ్టీ 100తో పోల్చి చూస్తే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ పరిమిత రిస్‌్కతోనే రోలింగ్‌ రాబడులు అధికంగా ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం నిర్వహణలో రూ.461 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. యాక్టివ్‌ ఫండ్స్‌తో పోలిస్తే ఇండెక్స్‌ ఫండ్స్‌తో ఉన్న ప్రయోజనం వ్యయ భారం తక్కువ. ఈ పథకంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.21 శాతంగా ఉంది. 

ప్రతికూలతలు 
దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తాయి. కానీ, అదే సమయంలో అధిక రిస్క్‌ కూడా ఉంటుంది. కరెక్షన్లలో ఎక్కువ విలువను కోల్పోవడం ఈ విభాగంలో గమనించొచ్చు. అందుకని రిస్క్‌ భరించే సామర్థ్యంతో ఉన్న వారు, కనీసం 7–10 ఏళ్ల కాలానికి ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు.

చదవండి: ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్‌ పంచ సూత్రాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top