వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ కీలక నిర్ణయం!

Deepinder Goyal Said The Company From A Single Ceo Structure To Having Multiple Ceos Running - Sakshi

ప్రముఖ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్‌ పిరియడ్‌ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి. లాకిన్‌ పిరియడ్‌ పూర్తయిన జులై 25న ఒక్కరోజే సుమారు వెయ్యికోట్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నష‍్టాల్ని బేరీజు వేసుకొని వాటి నుంచి బయటపడేందుకు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

జొమాటో సంస్థ జొమాటోతో పాటు బ్లింకింట్‌, హైపర్‌ ప్యూర్‌, ఫీడింగ్‌ ఇండియా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. అయితే వాటి నిర్వహణ కష్ట తరంగా మారాయి.నష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.ఈ క్రమంలో జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎటర్నల్‌ పేరుతో జొమాటోతో పాటు బ్లింకింట్‌, హైపర్‌ ప్యూర్‌, ఫీడింగ్‌లను ఒకేతాటికింద తీసుకొని రానున్నారు. ఆ సంస్థలకు శాశ్వతంగా నలుగురు సీఈవోల్ని నియమించనునున్నారు. తద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేయడంతో, వ్యాపార నిర్వహణ, నష్టాల్ని నివారించవచ్చని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఈవో దీపిందర్‌ గోయల్‌ మాట్లాడుతూ 'నేను సీఈవోగా ఉన్న కంపెనీ నుంచి ఇతర సంస్థలకు సైతం సీఈవోల్ని నియమించబోతున్నాం. ఒకరికొకరు పోటీ పడుతూ ఒక సూపర్ టీమ్‌గా పని చేస్తారంటూ ' అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కొనసాగుతున్న నష్టాలు 
బీఎస్‌ఈలో జొమాటో స్టాక్స్‌ నష్టాల పరపరం కొనసాగుతుంది. గత శుక్రవారం బీఎస్‌ఈ మార్కెట్‌లో జొమాటో షేర్‌ రూ.46.80 వద్ద ముగిసింది. ఇక ఈ(సోమవారం) వారం ప్రారంభంలో సైతం నష్టాల్ని చవిచూశాయి. సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి జొమాటో 0.30శాతం నష్టపోయి రూ.46.50వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top