బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌ : 2000 జీబీ డేటా

BSNL Rs 949 broadband plan offers up to 2000GB data - Sakshi

బ్రాడ్‌బ్యాండ్  ప్లాన్లను సవరించిన బీఎస్‌ఎన్‌ఎల్‌

 హై స్పీడ్‌,  అధిక డేటా

మార్చి 31, 2021 ఎఫ్‌టిటిహెచ్ ప్లాన్‌ల  ఇన్‌స్టాలేషన్‌ ఉచితం

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తన వినియోగదారులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్‌టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్  ప్లాన్లను సవరించింది.  సూపర్ స్టార్ 2 ప్లాన్‌గా పిలిచే బ్రాడ్‌ బ్యాండ్‌ రూ . 949 ప్లాన్‌లో  తాజాగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  2000 జీబీ వరకు డేటాను ఆఫర్‌ చేస్తోంది. ఈ లిమిట్‌ దాటిన తరువాత డేటా స్పీడ్‌  10 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. 

ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధర రూ .777 నుండి రూ .16999  వరకు ఉండగా ఎఫ్‌టిటిహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మార్చి 31, 2021 వరకు ఉచితంగా ఇన్‌స్టాల్ చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్లను మార్చి 1 న సవరించింది. ఇందులో హై స్పీడ్‌,అధిక డేటా అందిస్తోంది.   ఈ కొన్నిప్లాన్ల రేటు మార్చలేదు కానీ  పేర్లను మార్చింది. సూపర్ స్టార్ 2 ప్లాన్ అని కూడా పిలిచే ఈ  ప్లాన్లు ఇలా ఉంటాయి.

రూ .1000 లోపు ప్లాన్స్‌
రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  దీన్ని ఇపుడు ‘ఫైబర్ టీబీ ప్లాన్‌గా మార్చింది.  ఇందులో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  1000 జీబీ డేటా లభ్యం.
రూ 779 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  ఈ ప్లాన్‌ను ఎందుకు మార్చలేదో స్పష్టంగా తెలియదు. ఇది యథాతథంగా ఉంది.
రూ 849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  1500 జీబీ డేటా 
రూ .949 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  2000 జీబీ డేటా 

రూ .2500 లోపు ప్లాన్స్‌
రూ .1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  3300  జీబీ వరకు డేటా
రూ. 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా
రూ .2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్:  300ఎంబీపీఎస్ స్పీడ్‌తో  5500 జీబీ వరకు డేటా 
టాప్-టైర్ ప్లాన్‌ల ధరలు రూ. 4499, రూ .5999, రూ .999, రూ .16,999గా ఉంటాయి. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో  6500, 8000, 12000,  21000 జీబీ వరకు డేటా అందిస్తుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top