
జియోకు పోటీగా...బంపర్‌ఆఫర్‌తో ముందుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) జియోకు పోటీగా మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకువచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా జియో తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2545కు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.
అదనంగా 90 రోజుల వ్యాలిడిటీ..!
ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ తన యూజర్ల కోసం వరుస ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని ప్రకటించింది. గతంలో ఈ ప్లాన్‌పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీని బీఎస్‌ఎన్‌ఎల్ అందించింది. ఇప్పడు మరో 30 రోజుల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తంగా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై యూజర్లకు ఏకంగా 455 రోజుల వ్యాలిడిటీ రానుంది. ఈ ఆఫర్ జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది.
రూ. 2,399 ప్లాన్‌పై మరిన్నీ ఆఫర్స్..!
బీఎస్‌ఎన్‌ఎల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399పై అదనపు వ్యాలిటిడీతో పాటుగా పలు ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్లు డేలీ 3 జీబీ డేటా వరకు పొందవచ్చును. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌పై ప్రముఖ ఓటీటీ ఈరోస్ నౌ సేవలను కూడా యూజర్లు సొంతం చేసుకోవచ్చును. ఈ ప్లాన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్‌లకు యాక్సెస్ చేయవచ్చును.
చదవండి: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ.600కే డైలీ 5జీబీ డేటా!.. ఇంకా డైలీ?
చదవండి: దీర్ఘకాలిక వ్యాలిడిటీ, ఓటీటీ సేవలను అందిస్తోన్న టాప్ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్ ఇవే..!