కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతో తెలుసా? | BMW M440i Launched in India at Rs 1 09 crore | Sakshi
Sakshi News home page

కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతో తెలుసా?

May 3 2026 9:21 PM | Updated on May 3 2026 9:23 PM

BMW M440i Launched in India at Rs 1 09 crore

ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త M440iను భారతదేశంలో రూ.1.09 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా భిన్నంగా.. ఫోల్డబుల్ హార్డ్-టాప్ రూఫ్‌ పొందుతుంది.

M440i కన్వర్టిబుల్‌ 3.0-లీటర్, ఆరు-సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా.. 369bhp పవర్, 500Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, బీఎండబ్ల్యూ xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ (AWD) పొందుతుంది. 4.9 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకునే ఈ కన్వర్టిబుల్ టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

డిజైన్ పరంగా.. ఈ మోడల్ పెద్ద కిడ్నీ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన బాడీవర్క్, స్పోర్టీ బంపర్‌లు పొందుతుంది. ఇది స్టాగర్డ్ సెటప్‌తో కూడిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, వెనుక భాగంలో వ్రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.

లోపల క్యాబిన్‌లో 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉన్నాయి. దీనికి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోల్స్టరీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెర్సిడెస్-బెంజ్ CLE క్యాబ్రియోలెట్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement