భారతదేశంలో టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag). ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు, FASTag లోని చిప్‌ను స్కాన్ చేసి టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా వాహన యజమాని ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల నగదు చెల్లింపుల అవసరం తగ్గి, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.
అయితే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.
విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చడం వల్ల.. టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది.
For a smooth and hassle-free journey, ensure your FASTag is pasted on vehicle's windscreen firmly.
Holding the FASTag instead of pasting it can lead to blacklisting.#NHAI pic.twitter.com/JdDq4DOJaQ— NHAI (@NHAI_Official) April 28, 2026
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ మోసం!
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.
ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!


