
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టయోటా వినియోగదారులకు శుభవార్త అందించింది. వివిధ రకాల మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్‌తోపాటు నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ప్రకటించింది. టయోటా గ్లాంజా, యూరిస్, అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్ల వర్తించనున్నాయి. కార్ల అమ్మకాలను పెంచడంలో భాగంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇన్నోవా క్రిస్టా, వెల్‌ఫైర్, ఫార్చ్యూనర్ మోడళ్లపై ఎటువంటి తగ్గింపులు లేవు.
టయోటా గ్లాంజా అసలు ధర రూ.7.34 లక్షలు ఈ ఆఫర్ లో భాగంగా రూ.20 వేల వరకు వాహనంపై బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే, 8వేల రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక అర్బన్ క్రూయిజర్ అసలు ధర రూ.8.62 లక్షలు అయితే, దీనిపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక చివరిగా యూరిస్ అసలు ధర రూ.9.16 లక్షలు అయితే, దీనిని 50 వేల రూపాయల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?