మహిళలకు బ్యాంక్‌ అదిరిపోయే ఆఫర్లు.. | Bank Of Baroda Offers To Women On Womens Day | Sakshi
Sakshi News home page

మహిళలకు బ్యాంక్‌ అదిరిపోయే ఆఫర్లు..

Mar 8 2024 8:03 AM | Updated on Mar 8 2024 12:00 PM

Bank Of Baroda Offers To Women On Womens Day - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మహిళా ఖాతాదార్లకు ఆఫర్లు ప్రకటించింది. 

బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా లేదా బీఓబీ వుమెన్ పవర్ కరెంట్ ఖాతాలను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు రుణం పొందేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనుంది.

ఇదీ చదవండి: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం

ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25%, విద్యా రుణాలకైతే 0.15%, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీఓబీ ప్రకటించింది. రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement